టీఆర్పీ కుంభకోణం : ఆ రెండు ఛానెల్స్ మధ్య బిగ్ ఫైట్

ముంబై పోలీసులు టీఆర్పీ రేటింగ్స్ కుంభకోణాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు.ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును అందిస్తారని గుర్తించారు. ఈ స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు ఇపటికే అరెస్ట్ చేశారు.
మరికొంత మందికి నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో రిపబ్లిక్ టీవీ కూడా ఉంది. పబ్లిక్ టీవీ యజమాని అర్నాబ్ గోస్వామి ఇవాళ విచారణకు హాజరుకావాలని ముంబై పోలీసులు ఆదేశించారు. అయితే తమపై కక్షపూరితంగానే పోలీసులు ఇదంతా చేస్తున్నారని.. దీన్ని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు గోస్వామి. టీఆర్పీ కుంభకోణం విషయంలో రిపబ్లిక్, ఇండియా టుడే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇండియా టుడేపై FIR పెట్టి చర్యలు తీసుకోవడానికి ముంబై కమిషనర్ ఎందుకు సంకోచిస్తున్నారో చెప్పాలన్నారు. మొత్తానికి ఈ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే ఛానెల్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది.
