తెలంగాణలో 1,196 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,53,651కి చేరింది.
నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,390కి చేరింది. కరోనాబారి నిన్న 1,745 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,34,234కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 15,205 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
