దుబ్బాక విజయం.. భాజాపా అధిష్టానం ఖుషి !

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలన్న భాజాపా ఆశయానికి ఆశలు చిరుగురించాయి. దానికి దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు నాంది పలికినట్టయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. ఈ విజయంపై భాజాపా అధిష్టానం ఆనందం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు.
“దుబ్బాక ఒక చరిత్రాత్మక విజయం. భాజపాకు తమ ఆశీస్సులు అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత సేవ చేసేందుకు ఈ విజయం మాకు మరింత శక్తినిస్తుంది. మా కార్యకర్తలు ఎంతో కృషి చేశారు” అంటూప్రధాని మోడీ ట్విట్ చేశారు.
“దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన భాజపా కార్యకర్తలకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి శుభాభినందనలు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడంలో మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది” అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు.
“దుబ్బాక ఉప ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించడలో కీలక పాత్ర పోషించిన భాజపా కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి అభినందనలు. అధికార తెరాస అవినీతిని, రాచరిక రాజకీయాలను వ్యతిరేకిస్తూ, ప్రధాని మోదీపై మరింత విశ్వాసముంచుతూ.. ఈ ఫలితాలు వెలువడ్డాయి” భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్ చేశారు.
