బాహుబలి కమాండ్ కంట్రోల్ సెంటర్’ని ప్రారంభించిన కేటీఆర్

బాహుబలి కమాండ్ కంట్రోల్ సెంటర్ (పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్, డేటా సెంటర్)ను ఈ ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 5 వేల సీసీ కెమెరాల దృశ్యాలను ఒకేసారి తెరపై వీక్షించేలా ఈ సెంటర్ ని ఏర్పాటు చేశారు.
‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేసి.. ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న జంట పోలీస్ టవర్లలో ఏర్పాటు కాబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి సమాంతరంగా దీన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే డయల్ 100కు అనుసంధానం చేయనున్నారు.
