ఐపీఎల్13 విజేత ముంబైకి గూగుల్ సప్రైజ్

ఐపీఎల్ 13వ విజేత ముంబయి జట్టుకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి ముంబయి జట్టు పేరుతో వెతికితే తారాజువ్వలు స్క్రీన్‌పై వెలిగేలా ఏర్పాటు చేసింది. ముంబయి జట్టు వివరాలతో పాటు.. దిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ స్కోరు బోర్డు కూడా స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి.
ఇక మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ లో ఢిల్లీపై ముంబై గెలుపొంది కప్ ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. ఇక 157 టార్గెట్ ని ముంబై 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రోహిత్‌కు కెప్టెన్‌గా ఇది ఐదో ట్రోఫీ. 2013, 2015, 2017, 2019లో కప్పు గెలిచిన ఆ జట్టు మరోసారి 2020లో ఛాంపియన్‌గా నిలిచింది.
