ఐపీఎల్-13 విజేత ముంబై

ఐపీఎల్-13లో సంచలనం జరగలేదు. మరోసారి ముంబైనే కప్ ని ఎగరేసుకుపోయింది. తొలిసారి ఫైనల్ కు చేరిన ఢిల్లీ జట్టు ముంబై అనుభవం ముందు తలవంచక తగ్గలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దిల్లీని అయిదు వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (65*, 50 బంతుల్లో, 6×4, 2×6), పంత్ (56; 38 బంతుల్లో, 4×4, 2×6) రాణించారు. ఆ జట్టును బౌల్ట్ (3/30) దెబ్బతీశాడు.
అనంతరం బరిలోకి దిగిన ముంబయి 18.4 ఓవర్లలోనే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (68; 51 బంతుల్లో, 5×4, 4×6) అర్ధశతకంతో చెలరేగాడు. డికాక్ (20; 12 బంతుల్లో, 3×4, 1×6), సూర్యకుమార్ (19; 20 బంతుల్లో, 1×4, 1×6), ఇషాన్ (33; 19 బంతుల్లో, 3×4, 1×6) రాణించారు.
