తెలంగాణలో 635 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 635 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,77,151కి చేరింది. నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,489కి చేరింది.
కరోనాబారి నుంచి నిన్న 564 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,67,992కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,670 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,557 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
