‘నారప్ప’ టీజర్ వచ్చేసింది

విక్టర్ వెంకటే బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఆయన తాజా చిత్రం ‘నారప్ప’ టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌ కథానాయకుడిగా తమిళంలో విజయం సాధించిన ‘అసురన్‌’కు తెలుగు రీమేక్‌. వెంకీ సతీమణిగా ప్రియమణి నటిస్తున్నారు. మణిశర్మ సంగీతమ్ అందిస్తున్నారు.

రేపు వెంకీ బర్త్ డే  కానుకగా నారప్ప టీజర్ ని వదిలారు. ఇందులో వెంకీ రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆయన కట్టు, బొట్టు, గెటప్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి.