మిస్టరీ స్పిన్నర్ సీక్రెట్ మ్యారేజ్

కోల్‌కతా జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని వరుణ్ అధికారికంగా వెల్లడించలేదు. అతడి స్నేహితుడు అరుణ్ కార్తిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుణ్ పెళ్లి ఫొటో షేర్ చేయడంతో అభిమానులకు ఈ విషయం తెలిసింది.
ఐపీఎల్ 13లో వరుణ్ చక్రవర్తి అదరగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ సీజన్లో 6.84 ఎకానమీతో పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని బంతులు వేసే అతడు ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ గాయంతో అతడు పర్యటనకు దూరమయ్యాడు. కాగా, అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్ సత్తాచాటిన విషయం తెలిసిందే.
