పంత్ మెరిశాడు

అవునూ.. పంత్ మెరిశాడు. ఆసీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ (103*; 73 బంతుల్లో, 9×4, 6×6) బాదాడు. దీంతో ఆసీస్‌పై టీమిండియా ఆధిక్యం 472 పరుగులకు చేరింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 194 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఆసీస్ ని తొలి ఇన్నింగ్స్ లో 108కే కట్టడి చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు 86 పరుగుల ఆధిక్యం లభించింది. 

ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ రెచ్చిపోయి ఆడారు.ఓపెనర్‌ పృథ్వీ షా (3) మాత్రమే విఫలమయ్యాడు.మిగితా ఆటగాళ్లందరూ రాణించారు. హనుమ విహారి (104*; 194 బంతుల్లో, 13×4); రిషభ్‌ పంత్‌ (103*; 73 బంతుల్లో, 9×4, 6×6) అజేయ శతకాలతో సత్తాచాటగా, శుభ్‌మన్‌ గిల్‌ (65; 78 బంతుల్లో, 10×4), మయాంక్ అగర్వాల్‌ (61; 120 బంతుల్లో, 4×4, 2×6) అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ అజింక్య రహానె (38) ఫర్వాలేదనిపించారు. భారత్‌ శనివారం ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 386 పరుగులు సాధించింది. దీంతో ఆసీస్‌పై టీమిండియా ఆధిక్యం 472 పరుగులకు చేరింది.