జాతీయ గీతం మారింది

ఆస్ట్రేలియా మరో నూతన మార్పును ఆహ్వానించింది. ఆ దేశ జాతీయ గీతంలో మార్పులు చేసింది. తమ పురాతన సంస్కృతి, వారసత్వాలను మరింతగా ప్రతిబింబించేలా ‘అడ్వాన్స్‌ ఆస్ట్రేలియా ఫెయిర్‌’ అనే ఆ దేశ జాతీయ గీతంలోని కొన్ని పదాల్లో మార్పు చేశారు. తమ దేశంలో ప్రాచీన కాలం నుంచి నివసిస్తున్న ఆదిమ తెగలకు చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ గీతంలో ఈ మార్పు చేశామని ఆ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకు ఉన్న జాతీయగీతంలో “యంగ్‌ అండ్‌ ఫ్రీ” (యువత మరియు స్వేచ్ఛ) అనే పదబంధం స్థానంలో.. ఆ దేశ మూలాలను, చరిత్రను ప్రతిబింబించేలా ”వన్‌ అండ్‌ ఫ్రీ” (ఏకత్వము మరియు స్వేచ్ఛ) అనే పదాలను ప్రవేశపెట్టారు. ఇక ఈ నెల 7 నుంచి భారత్ తో జరగనున్న మూడో టెస్ట్ లో కొత్త జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు ఆసీస్ ఆటగాళ్లు.