ఆ కేసులో.. అచ్చెన్నాయుడు అరెస్ట్ !

ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో అచ్చెన్నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసి.. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. వైకాపా బలపరిచిన అభ్యర్థి వేరే గ్రామంవారితో కలిసి నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేయగా స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో వైకాపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కోటబొమ్మాళి పీఎస్‌లో 22 మందిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నిన్న 12 మందిని అరెస్టు చేయగా ఇవాళ అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
