ఏపీ ఆలయాల్లో దాడులు.. పార్లమెంట్ లో నోటీసులు !

ఆంధ్రప్రదేష్ లోని హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చించాలని భాజాపా ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. అవర్లో ప్రస్తావించేందుకు నోటీసు ఇచ్చారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ఏడాది డిసెంబర్ 29న విజయనగరం జిల్లా రామతీర్ధంలో రాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా పలు దేవాలయాలపై దాడులు జరిగాయి. అయితే ఈ దాడికి పాల్పడిన దుండగులని పట్టుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనిపై భాజాపా, జనసేన, తెదేపా ఆందోళనకి దిగాయి. మరోవైపు, ఈ దాడుల వెనక తెదేపా కుట్ర ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు జీవీఎల్.
