ఇంగ్లండ్’కు గుండు కొట్టడం ఖాయం

ఆసీస్ టూర్ లో అద్భుత విజయంతో టీమిండియా ఊపు మీదుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం అంటున్నారు మాజీ క్రెకెటర్లు. భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న ఇంగ్లాండ్‌.. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

ఆ జట్టు బలహీనమైన స్పిన్‌ విభాగమే అందుకు కారణమని అతనన్నాడు. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌.. స్పిన్నర్లు మొయిన్‌ అలీ, డామ్‌ బెస్, జాక్‌ లీచ్‌లను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ”ఇలాంటి స్పిన్‌ దాడితో ఇంగ్లాండ్‌ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని నాకు అనిపించట్లేదు. భారత్‌ ఈ సిరీస్‌ను 3-0తో లేదా బహుశా 3-1తో సొంతం చేసుకునే అవకాశం ఉంది. గులాబి బంతి మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుంటేనే ఇంగ్లాండ్‌కు ఆ ఒక్క అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్‌లోనూ విజయావకాశాలు 50-50 గానే ఉంటాయని గంభీర్ చెప్పుకొచ్చారు.