మూడు సార్లు పెళ్లి.. భర్త, పిల్లలని చూపించాలనుకుంటున్న అంజలి !

హీరోయిన్ అంజలి తెలుగమ్మాయ్. కానీ తెలుగులో కంటే తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక టాలీవుడ్ ఎంత‌గానో ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’లో అంజలి ఓ కీలక పాత్రలో నటించింది. ఈ నెల 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అంజలి మీడియా ముందుకొచ్చింది. పర్సనల్, సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పింది.

పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారితో  క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం బాగుంది. ఆయ‌న సెట్లో అడుగు పెడితే అంతా నిశ‌బ్ద‌మే. ఆయ‌న‌తో మాట్లాడ్డానికి త‌న‌కు 15 రోజులు ప‌ట్టింది. న‌ట‌న‌పై ఆయ‌న అంకిత భావం త‌న‌కెంతో న‌చ్చిన‌ట్టు అంజ‌లి చెప్పుకొచ్చారు. త‌న కెరీర్‌లో ఇది అద్భుతమైన ప్రయాణమ‌ని ఆమె చెప్పుకొచ్చారు. కోర్ట్‌ సీన్‌ చేశాక… ఆ సీన్‌ బాగా వచ్చిందని పవన్‌కల్యాణ్‌ చప్పట్లు కొట్టి అభినందించారని గుర్తు చేసుకున్నారు.

ప్రేమ గురించి అంజలి స్పందించారు. తాను ప్రేమ‌లో ప‌డ‌లేద‌ని చెబితే అది అబ‌ద్దం అవుతుంద‌న్నారు. త‌న ప్రేమ వ‌ర్కౌట్ కాలేదు. త‌న ప్రేమ స‌క్సెస్ అయ్యి వుంటే త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసేదాన్ని. ఏ ఆడపిల్లైనా ప్రేమలో విఫల‌మైతే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయి గుండెలు చాలా సున్న‌తమైనవి అన్నారు. ఐనా తాను త్వరగానే కోలుకున్నా. అందుకు అమ్మ సపోర్ట్ నే కారణమన్నారు. ఇక త‌న ప్రేమ..‌ పెళ్లి గురించి జ‌రిగిన ప్ర‌చారంపై కూడా అంజలి ఓపెన్ అయ్యారు. ఏకంగా త‌న‌కు ఐదు సార్లు పెళ్లి చేశారు.. పెళ్ళిళ్ల‌తో ఆగ‌లేద‌ని, ఏకంగా పిల్లలు కూడా పుట్టారని రాశారు. ద‌య‌చేసి త‌న త‌న‌ భర్తని, పిల్లల్ని చూపించాల‌ని.. కోరారు.