ముగ్గురి చేరికతో CSK బలం పెరిగింది

ఐపీఎల్ లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు టాప్ లో నిలిచే జట్టు. ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచిన జట్టు. ఎక్కువ సార్లు ఫైనల్ కు చేరిన జట్టు చెన్నైనే. ధోని సారధ్యంలో ఆ జట్టు ఎప్పుడూ అంచనాల మించి రాణించింది. కానీ గత యేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2020లో మాత్రం చెన్నై అంచాలని తలక్రిందులు చేసింది. 


పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే గతేడాది ఐపీఎల్‌ వైఫల్యాలను మర్చిపోయి ఈ  యేడాది టైటిల్ ని ఎగరేసుకుపోయిందుకు చెన్నై రెడీ అవుతోంది. ప్రస్తుత సీజన్‌కు ముందు కొందరు ఆటగాళ్లను వదిలేసిన సీఎస్‌కే భారీ ధర పెట్టి కృష్ణప్ప గౌతమ్‌, మొయిన్‌ అలీని కొనుగోలు చేసింది. రాజస్థాన్‌ నుంచి రాబిన్‌ ఉతప్పను బదిలీ చేసుకుంది. ఈ ముగ్గురూ చేరడం జట్టుకు అదనపు బలం చేకూరిందని ఆ జట్టు కెప్టెన్ హస్సీ అన్నాడు. ‘వాళ్లు ముగ్గురూ చేరడంతో జట్టు సమతూకం మరింత పెరిగింది. మొయిన్‌ చక్కని ఆల్‌రౌండర్‌. రాబిన్‌కు ఎంతో అనుభవం ఉంది. గతంలో అద్భుతంగా ఆడాడు. గౌతమ్‌లో చక్కని ప్రతిభ దాగుంది. దానిని మరింత సానబెట్టాలని అనుకుంటున్నాం’ అని హస్సీ తెలిపాడు.