అక్షయ్ కుమార్’కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్, మిలింద్, ఆర్ మాధవన్, అమీర్‌ఖాన్, రణబీర్ కపూర్, కరిక్ ఆర్యన్, రోహిత్ సరఫ్, సిద్ధాంత్ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి, రణ్‌వీర్ షోరే, మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి తదితరులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్ ట్విట్ చేశారు.
‘ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కోవిడ్ నిబంధనల మేరకు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, వైద్య చికిత్సలు చేయించుకుంటున్నా. ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోండి. అందరు జాగ్రత్తగా ఉండాలి’లని అక్షయ్ కోరారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
🙏🏻 pic.twitter.com/w9Q7m54BUN— Akshay Kumar (@akshaykumar) April 4, 2021
