రోజా డిశ్చార్జ్

ప్రముఖ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఒకేరోజు రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. అయితే ఆ ఆపరేషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆపరేషన్ తర్వాత పదిరోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న రోజా.. శనివారం డిశ్చార్జ్ అయ్యారు. చైన్నైలోని ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రోజా స్పందించారు. “నా ఆరోగ్య పరిస్థితి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నా. ఆస్పత్రిలో ఉన్నా. ఇంటిలో ఉన్నా నా ఆలోచనంతా వైసీపీ అభ్యర్థుల విజయం మీదే ఉంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. రోజా డిశ్చార్జ్ అవుతున్న సమయంలో.. ఆమె భర్త సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
