నిర్మలమ్మకు కేటీఆర్ మరోసారి లేఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ మరోసారి లేఖ రాశారు. కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల రుణాల చెల్లింపు పైన వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించాలి. అప్పటిదాకా రుణాల పైన వడ్డీని ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకోవాలి. అలా చేయడం ద్వారా ఎంఎస్ఎంఈలకు ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి మద్దతు లభించగలిగితే ఎంఎస్ఎంఈలు పూర్వ స్థితికి చేరుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచిస్తున్న ఈ సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
