‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పవన్-హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారని సర్వత్రా ఆసక్తి చూపించారు. ఇప్పుడీ.. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ.. చిత్రబృందం టైటిల్ ని ప్రకటించింది. ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసింది.

సామాజిక కోణంలో బలమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ మరింత పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత హరీశ్‌-పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌, రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. హీరోయిన్‌తోపాటు ఇతర నటీనటులని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.