డీజే టిల్లు టీజర్ టాక్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన చిత్రం ‘డీజే టిల్లు’. నేహాశెట్టి కథానాయిక. విమల్ కృష్ణ దర్శకుడు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కథానాయకుడు తన డీజే గొప్పతనం గురించి కథానాయికకు చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం సందడిగా సాగింది. సిద్ధు, నేహాశెట్టి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ యువతను మెప్పించేలా ఉన్నాయి. సిద్ధు లుక్, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చగా తమన్ నేపథ్య సంగీతం అందించారు.
