ఎన్టీఆర్ తో బుచ్చి.. ఓ స్పోర్ట్స్ డ్రామా

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా కనిపించనున్నారు.
ఇందులో తారక్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని సమాచారమ్. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే.. బుచ్చిబాబు సినిమాను ఖరారు చేశారు తారక్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెనతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమాను ఎన్ టీఆర్ తో చేయాలనే ప్రయత్నాల్లో చాన్నాళ్ల నుంచి ఉన్నారు.
తాజాగా దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదో స్పోర్ట్స్ డ్రామా అని తెలిసింది. ఇందులో తారక్ కబడ్డీ కోచ్ గా కనిపిస్తారట. ఆయనకు జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోనున్నారని చెబుతున్నారు. అంతేకాదు.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని చెబుతున్నారు.
