రాంగ్ డేట్ ఎంచుకున్న రాధేశ్యామ్

మార్చి 11న రాధేశ్యామ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. నిజానికి అది ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో పరీక్షల సమయం. ఈ విషయాన్ని పక్కనపెడితే.. రాధేశ్యామ్ కు దాదాపు అన్ని ఇండస్ట్రీస్ నుంచి పోటీ ఎదురవుతోంది.
పవన్ హీరోగా నటించిన భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న విడుదలై పెద్ద విజయం సాధిస్తే రాధేశ్యామ్ కు కష్టమే. రాధేశ్యామ్ కు ఆర్ఆర్ఆర్ రూపంలో మరో పోటీ ఉండనే ఉంది. రాధేశ్యామ్ రిలీజైన 2 వారాలకే ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అటు కోలీవుడ్ లో కూడా రాధేశ్యామ్ కు ఏమంత అనుకూలంగా పరిస్థితులు లేవు.
సూర్య నటిస్తున్న ఈటీ అనే సినిమాను సరిగ్గా రాధేశ్యామ్ విడులకు ఒక్క రోజు ముందు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. క కన్నడనాట కూడా పరిస్థితి కాస్త కష్టంగానే ఉంది. ఈమధ్య కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అతడు నటించిన ఆఖరి చిత్రం మార్చి 17న విడుదల కానుంది
