‘మాస్‌ కా దాస్‌’ మరో పాన్ ఇండియా సినిమా

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలు మాత్రమే కాదు.. మీడియం రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు పాన్ ఇండియా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యంగ్ హీరో విష్వక్‌సేన్‌ తాను చేయబోయే పాన్ ఇండియాను ప్రకటించారు. ‘మాస్‌ కా దాస్‌’ పేరుతో పాన్‌ ఇండియా చిత్రం చేయబోతున్నట్టు తెలిపారు. అయితే దానికి ఇంకొంత కాలం సమయం పడుతుందని చెప్పారు. 

ఆయన తాజా సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫక్తు కుటుంబ కథ. ‘నిన్నే పెళ్లాడతా’, ‘బొమ్మరిల్లు’, ‘చందమామ’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’… సినిమాల తరహాలో ఉంటుందన్నారు విశ్వక్ సేన్.