స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు’ ప్రారంభయ్యాయి. ఈ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈనెల 22న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు.
