జేడీయూ- బీజేపీ విడాకులు ?

బీహార్ లో కమలం పార్టీతో నీతీశ్ కుమార్ పార్టీ తెగదెంపులు చేసుకునేలా పరిణామాలు మారుతున్నాయి. గతకొద్దికాలంగా భాజపా, జేడీయూ మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేసేలా జులై 17 నుంచి జరిగిన నాలుగు సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఈ పరిణామాల మధ్య ఆగస్టు 11లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు ఆర్జేడీతో పొత్తుపై ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో లాలూ పార్టీ నీతీశ్‌పై అనుకూల వైఖరిని కనబరుస్తోంది. ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆగస్టు 11లోగా సరికొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పేలా వీరు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇదీగాక.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నీతీశ్ ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని కాంగ్రెస్ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి.
