‘పోకిరి’ రి-రిలీజ్ 175+ సెంటర్లలో.. ఆల్ టైమ్ రికార్డ్ !

‘పోకిరి’ రిలీజై 16 ఏళ్లయినా ఇంకా దాని పవర్ తగ్గలే. పండుగాడు మళ్లీ వస్తున్నాడంటే.. ప్రేక్షకులు ఇరగబడి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. మ‌హేష్‌బాబు  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న పోకిరి సినిమా రీ రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంట‌ల్లోనే అన్ని షోస్ హౌస్ ఫుల్ అయి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

తొలుత కొన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అభిమానుల రెస్పాన్స్ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వ‌చ్చారు. ఇండియాతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో క‌లిసి ఇప్పటి వరకు  175 స్క్రీన్స్‌లో పోకిరిని 4 కే వెర్ష‌న్‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగనుందని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన థియేట‌ర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలో ప‌లు న‌గ‌రాల్లో అడ్వాన్ప్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ద గంట‌ల్లోనే థియేట‌ర్స్ హౌజ్‌పుల్ అయ్యాయి. హీరోయిజాన్ని డిఫ‌రెంట్ స్టైల్‌లో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పోకిరిలో ఆవిష్క‌రించారు. మ‌హేష్ డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్ హైలెట్.