తాప్సీ బోల్డ్ సటైర్ : ‘నా సెక్స్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు’

సొట్టబుగ్గల సుందరి తాప్సీ బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. వైవిధ్యమైన సినిమాలతో విజయాలు అందుకుంటోంది. తాప్సీ హీరోయిన్ గా నటించిన దోబారా సినిమాతో ఆగస్ట్ 19న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో తాప్సీ బిజీగా ఉంది. అయితే కాఫీ విత్ కరణ్ షో లో ఆమె కనిపించడం లేదు. దీనిపై ఓ మీడియా ప్రతినిధి అడగగా.. బోల్డ్ ఆన్సర్ చేసింది. 

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనపోవడానికి కారణమేమిటని తాప్సీని ప్రశ్నించగా.. ‘ఆ షోకు ఆహ్వానం అందుకునేంత ఇంట్రెస్టింగ్ గా నా సెక్స్ లైఫ్ లేదు. అందుకే ఆ షోలో కనిపించలేదు’ అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది. తాప్సీ సమాధానం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాఫీ విత్ కరణ్ షో మసాలా టాక్ షో అంటూ తాప్సీ చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాఫీ విత్ కరణ్ సీజన్ 1 లో అక్షయ్ కుమార్-సమంత, విజయ్ దేవరకొండ-అనన్య పాండే, జాన్వీ కపూర్-సారా అలీఖాన్, అమీర్ ఖాన్ -కరీనా కపూర్ సందడి చేసిన సంగతి తెలిసిందే.