మునుగోడు ఓటర్లకు కేసీఆర్ పర్సనల్ లెటర్స్

మునుగోడులో గులాబీ దావత్ లు అయిపోయినవి. ఇప్పుడు లేఖల దగ్గరకు వచ్చింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న సుమారు 3.95 లక్షల మంది లబ్ధిదారులకు కేసీఆర్ లేఖలు రాయనున్నారు. నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగత లేఖలు రాయడానికి సిద్ధమయ్యారు.
ఆసరా పింఛన్లు, పంట రుణాల మాఫీ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, దళిత బంధు, ధాన్యం సేకరణ, వడ్డీలేని రుణాలను పొందిన లబ్ధిదారులకు కేసీఆర్ వ్యక్తిగత లేఖలు రాయనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3,34,994 మంది లబ్ధిదారులు టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. రూ.10,260 కోట్లు లబ్ధిపొందారని కేసీఆర్ లేఖలో ప్రస్తావించనున్నారు.
