నయనతారకి కవలలు.. తెరపైకి సరోగసి వివాదం

స్టార్ హీరోయిన్ నయనతార తల్లయింది. నయన్-విఘ్నేష్ శివన్ దంపతులకి కవలలు పుట్టారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం ప్రకటించారు. ‘‘నయన్, నేను అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల మగ పిల్లలు పుట్టారు. వారికి మీ ఆశీస్సులు కావాలి’’ అని వ్యాఖ్యానిస్తూ.. దంపతులిద్దరూ చిన్నారుల్ని ముద్దాడుతున్న ఫొటోని పంచుకున్నారు. అయితే సరోగసి పద్ధతిలో వీళ్లు తల్లిదండ్రులైనట్టు తెలుస్తోంది.
మరోవైపు సరోగసి పై నటి కస్తూరి చేసిన ట్విట్ వివాదాస్పదమైంది. ఇండియాలో సరోగసి బ్యాన్. 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ప్రోత్సహించకూడదు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం’’ అంటూ ఆమె ఓ ట్వీట్ చేసింది. దీనిని చూసిన నయనతార అభిమానులు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
