‘ఒకే ఒక జీవితం’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

టైమ్ ట్రావెల్ పాయింట్‌కు మదర్ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. శర్వానంద్, రీతూ వర్మ, అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ చిన్ని సినిమాగా పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోనూ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఈ మూవీ సోనీలివ్ (SonyLiv) ఓటీటీలో వస్తోందని ముందే అనౌన్స్ చేశారు. తాజాగా సోమవారం (అక్టోబర్ 10) రిలీజ్ డేట్‌ను ఈ ఓటీటీ అధికారికంగా అనౌన్స్ చేసింది. జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకే ఒక జీవితం మూవీ ఈ నెల 20 నుంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్‌లో” అంటూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ ట్వీట్లో మూవీ ట్రైలర్‌ను కూడా జోడించారు.
