ఎన్టీఆర్ చెప్పిన జోస్యం నిజమైంది.. నయన్ కు కవలలు !

‘అదుర్స్’ సినిమాలో చారి పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన జోస్యమే నిజమైంది. హీరోయిన్ నయనతార కు ట్విన్స్ పుట్టారు. ఇద్దరూ మగ బిడ్డలే. అదుర్స్ సినిమాలో స్విమింగ్ పూల్ సీన్ లో చారి పాత్రలో ఎన్టీఆర్ జోస్యం చెబుతాడు. ‘మీకు కవల పిల్లలు పుడతారండీ’ అంటూ. అది సరదా సీన్ నే అయినా ఇప్పుడు అదే నిజమైంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో తారక్ చెప్పిన జోస్యం నిజమైందని గుర్తు చేస్తూ.. పోస్టులు పెడుతున్నారు. నయన్-విగ్నేష్ దంపతులు షేర్ చేసిన కవల పిల్లల ఫోటోలతో పాటు అదుర్స్ సినిమాలో తారక్ చెప్పిన జోస్యం సీన్ ను కలిపి వైరల్ చేస్తున్నారు. అన్నట్టు పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే నయన్ తల్లి కావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరోగసి ద్వారా పిల్లలు కన్నారనే ప్రచారం జరుగుతోంది.
#Nayan & #vigneshshivan have become Amma & Appa❤️
Blessed with twin baby Boys❤️❤️
Uyir😇❤️& Ulagam😇❤️#Nayanthara #Nayantharahot #NayantharaVigneshShivan #nayantara #nayanthara75 #vignesh @VigneshShivN @NayantharaU https://t.co/boOcNZwghG pic.twitter.com/BGIrQNO3lr— OTTRelease (@ott_release) October 9, 2022
