సిల్క్‌ చీరలో సన్నీ.. రెచ్చిపోయిందిగా !

హీరో మంచు విష్ణు కోసం హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కట్టుకుంది. సూర్య దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమా జిన్నా. మరో హీరోయిన్ గా పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఐటమ్ సాంగ్.. అంతకుమించి.. అన్నట్టుగా ఉన్న సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నువ్వొస్తావని నేను సిల్క్‌ చీర కట్టుకుంటిని’ అంటూ సాగే ఈ పాటలో సన్నీ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. సరికొత్త భంగిమల్లో అదరిరిపోయే స్టెప్పులతో హీటెక్కించింది. ఈ పాటను గణేశ్‌ రచించారు. నిర్మలా రాథోడ్‌, సింహ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.