కీర్తి.. గ్లామర్ క్వీన్

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ తో మరో విజయాన్ని అందుకుంది. ఇక సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో అద్భుతమైన నటనను కనబర్చింది. స్టార్ హీరోయిన్  లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఎంత మంచి నటి అయినా..  గ్లామర్ హీరోయిన్ గా రాణిస్తేనే.. తృప్తి కలుగుతుంది. ఆ లోటు కీర్తి సురేష్ లో ఉంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది.. ఈ ముద్దుగుమ్మ.

తాజాగా కీర్తి సురేష్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. జాలి లాంటి డ్రెస్ లో తనలోని అందాలు హైలైట్ అయ్యేలా పోజులు కొట్టింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారాయి. గ్లామర్ క్వీన్, స్టన్నింగ్ అంటూ.. అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ లో నటిస్తుంది. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నటిస్తుంది.