కేసీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. మాట్లాడారు. కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
‘మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? సిద్దిపేట రోడ్లు.. మునుగోడు రోడ్లకు తేడా చూడండి. కేసీఆర్.. మీరు రాష్ట్ర ప్రజల సొత్తు రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకు వెళ్తారు. ప్రజలందరికి దృష్టి మునుగోడు ఉప ఎన్నికపైనే ఉంది. దేశం మొత్తం దీనిపై చర్చించుకుంటోంది’’ అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
