బాలయ్య తోపు.. ఏకంగా ప్రభాస్, గోపీచంద్ లతో !

నటసింహం నందమూరి బాలయ్య ఎవ్వరినైనా కలపగలరు. ఆహా వేదికగా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు. ఆయన హోస్ట్ గా ప్రస్తుతం #UnstoppableWithNBKS2 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాంబినేషన్లను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ లను కలిపి ఇంటర్వ్యూ చేసారు. దీనికి సంబంధించిన ఏపీసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని ఆహా అప్ డేట్ ఇచ్చింది.
వర్షం సినిమాతో ప్రభాస్ – గోపీచంద్ స్నేహితులుగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రభాస్ తనకు నచ్చిన యాక్షన్ జోనర్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. బహుశా.. ఆహా వేదికగా ఫ్యాన్స్ తరుపున ఈ ప్రశ్నను బాలయ్య ప్రభాస్-గోపీచంద్ లను ఆడగినట్టు సమాచారం. మరీ.. వాళ్లు ఏం ఆన్సర్ ఇచ్చారు అన్నది తెలియాలంతే.. మెగా ఏపీసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
