న్యూ ఇయర్ ఎఫెక్ట్ : చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరం, ఆదివారం సెలవు దినం కావడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున బాలాజీ దర్శనానికి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే నిలిపివేశారు.
