#HanuMan : అంజమ్మక్క వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. ఈ చిత్రం అంజనాద్రి అనే కల్పిత గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ను అద్భుత స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ను మించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ రాక కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 23న హనుమాను ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె అంజమ్మ అక్కగా కనిపించబోతున్నారు. ఆదివారం వరలక్ష్మీ పుట్టినరోజు కావడంతో.. ఆమె కు శుభాకాంక్షలు చెబుతూ.. అంజమ్మక్క ఫస్ట్ లుక్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమెది కీలక పాత్ర. సినిమాకు బ్యాక్ బోన్ లాంటి పాత్రలో ఆమె కనిపించబోతున్నారని తెలిపారు. పాన్ వరల్డ్ సినిమా గా ఏకంగా 11 సినిమాల్లో హనుమాన్ రిలీజ్ కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.