#Oscars : ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికి అవార్డుల పంట

95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం అదరగొట్టింది. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి కేటగిరి లలో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడుగా కే హుయ్ క్వాన్ ఆస్కార్ గెలుచుకోగా.. ఇదే  చిత్రానికి గానూ.. ఉత్తమ సహాయ నటిగా జామీ లీ కర్టిస్ కు ఎంపికైంది. దీంతో..  EVERYTHING EVERYWHERE ALL AT ONCE రెండు అవార్డులు దక్కాయి. ఇక అవార్డు అందుకునే సమయంలో కే హుయ్ క్వాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.