సూర్య భాయ్.. ప్రశంసల జల్లు

సూర్య కుమార్ యాదవ్ ప్రత్యేకమైన ఆటగాడు. అతడికి మిస్టర్ 360 గా పిలుస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న సూర్య అదరగొడుతున్నాడు. మంగళవారం రాత్రి బెంగళూరుపై రెచ్చిపోయి ఆడిన సూర్య కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి.. ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

సునీల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. స్కై బౌలర్లతో ఆటాడుకుంటున్నాడు. తన బ్యాటింగ్‌ చూస్తుంటే గల్లీ క్రికెట్‌ ఆడుతున్నట్లే అనిపిస్తోంది. సాధన, శ్రమతో అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. తన కింది చేతిని అతను చక్కగా ఉపయోగిస్తాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో అతను లాంగాన్‌, లాంగాఫ్‌ సహా అన్ని వైపులా అద్భుతమైన షాట్లు ఆడాడని చెప్పుకొచ్చారు.