అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య, అంబటి తీవ్ర అభ్యంతరం !

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి చర్చకు పట్టుబట్టింది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పడంతో.. సభ మరింత హీటెక్కింది.

బాలయ్య మీసం తిప్పాల్సింది సినిమాలో ఇక్కడ కాదంటూ అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు రెచ్చగొడుతున్నారు. ఇది సరైంది కాదన్నారు. మీరు బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదు.. కోర్టులో కొట్టండని అంబటి ఎద్దేవా చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని ఇక్కడ కాదు.. మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న లాయర్లతో హైకోర్టు, సుప్రీం కోర్టులో వాదనలు చేయాలని సూచించారు. ఇక్కడ టీడీపీ సభ్యులు చేసిన చర్యలపై చర్యలు తీసుకోకుంటే.. మా వారిని రెచ్చగొట్టినట్లు అవుతుంది. ఇక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగే అవకాశం ఉందని అంబటి హెచ్చరించారు. స్పీకర్ పై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు మంత్రి బుగ్గన టీడీపీ ఆందోళనపై స్పందిస్తూ.. సరైన ఫార్మెట్ లో వస్తే చంద్రబాబు అరెస్ట్ మీద చర్చకు సిద్ధమని ప్రకటించారు. బీఏసీలో చర్చించడాంకి రండి. ఆ తర్వాత బాబు అరెస్ట్ తో పాటు ఇతర అంశాల మీద కూడా చర్చించిద్దామని చెప్పారు. కానీ టీడీపీ సభ్యులు ఇవేవీ పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించారు. మొత్తానికి.. అసెంబ్లీలో బలయ్య మీసం తిప్పడం హాట్ టాపిక్ గా మారింది.