నెట్ ఫ్లిక్స్ లో లియో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

దళపతి విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన లేటెస్ట్ చిత్రం లియో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాల తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష తదితరులు కీలక పాత్రలు నటించడంతో.. పాన్ ఇండియా స్థాయిలో లియో కోసం వెయిట్ చేశారు. 

అయితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లియో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లోకేష్ మేజిక్ ఇందులో మిస్ అయింది. కానీ విజయ్ ఎప్పటిలాగానే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడీ.. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వారమే లియో ఓటీటీ రిలీజ్ ఉంటుందని సమాచారం.