ఒక్కరు కాదు.. ముగ్గురు డిప్యూటీ సీఎంలు !

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎల్బీ నగర్ లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మంత్రివర్గంలోకి ఎవరెవరు ? తీసుకోబోతున్నారు? అనే చర్చ జోరుగా జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం దాదాపు ఖాయం అనుకున్నారు. భట్టి తో పాటుగా సీతక్క కూడా డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది అంటున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ? ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు డిప్యూటీ సీఎంలు గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఎస్సీ వర్గానికి చెందిన భట్టీతో పాటు ఎస్టీ వర్గానికి చెందిన సీతక్కతో పాటు బీసీ గౌడ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కబోతున్నట్లు సమాచారం. ఇక ఇన్నాళ్లు పార్టీకి లాయల్టీగా ఉన్న అద్దెంకి దయాకర్ లాంటోళ్లకు కూడా అదృష్టం వరించనుందని తెలుస్తోంది. సామాజికలెక్కల ప్రకారం కేబినేట్ కూర్పు ఉండనుంది. అందులోనూ ప్రతి ఉప కులం నుండి ఒకరికి మంత్రి పదవి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లాంటోళ్లకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.