‘మేకప్ లేని రస్మిక’ని చూశారా.. ?

హీరోయిన్స్ ని మేకప్ లేకుండా చూసే ధైర్ఘ్యం చేయకూడదు అంటారు. ఎందుకంటే.. ? మేకప్ లేకుండా వారిని గుర్తుపట్టడం కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా.. వారిని చూసి తట్టుకోవడం ఇంకా కష్టం. మేకప్ లేకుండా మిల్కీ బ్యూటీ తమన్నానే సహించదు. ఇక, మిగితా హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లకంటే మన పక్కింటి పిల్ల నయం అనుకోవడం గ్యారెంటీ. ఐతే, మేకప్ లేకున్నా ముద్దొచ్చే ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఫిదా పిల్ల సాయి పల్లవి మేకప్ లేకున్నా.. అందంగా ఉంటుంది.

ఇప్పుడీ లిస్టులో రష్మిక మందన కూడా చేరిపోయింది. ఆదివారం రస్మిక ఇంట్లోనే ఉంది. మేకప్ లేకుండా, వదిలేసిన జుట్టు, లూజ్ డ్రెస్సులో సెల్ఫీ తీసుకొంది. ఆ సెల్ఫీ పిక్ లని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేకప్ లేకున్నా.. రస్మిక ముద్దొస్తోంది. అందంగా ఉంది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఓ అదిరిపోయే లిప్ లాక్ ఉంది. ట్రైలర్ లోనే ఆ టేస్ట్ చూపించారు. సినిమాలో దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించబోతున్నారు ప్రేక్షకులు. ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్న సినిమా కోసం రస్మిక పేరు వినబడుతోంది. ఐతే, చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
When you are home in "messy hair" and "lousy cloths" and someone comes and asks for a picture..🙈 this is how I take a selfie to see how bad I actually look😝😂 🙊 pic.twitter.com/a6y6SgVTbM
— Rashmika Mandanna (@iamRashmika) May 5, 2019
