‘సీత’ రాక ఫిక్సయింది !


తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్-కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఐతే, టైటిల్ కు భిన్నంగా సినిమాలో కాజల్ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. బ్యాడ్ సీత అన్నమాట. ఇప్పుడు సీత రాక ఫిక్సయింది. ఈ నెల 24న సీతని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు రిలీజ్ డేటు పోస్టర్ ని వదిలారు.

ఇందులో ‘ఆర్ఎక్స్100’ భామ పాయల్ రాజ్ పుత్ హాట్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. ‘బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి.. ‘ అంటూ హాట్ హాట్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది పాయల్. ఇప్పటికే ఆ సాంగ్ ని విడుదల చేసి.. సినిమాపై అంచనాలని పెంచేసింది చిత్రబృందం. ఆ ఐటమ్ హీటుని థియేటర్స్ లో చూడాలంటే ఈ నెల 24 వరకు ఆగాల్సిందే.

తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కాజల్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ చందమామ అనిపించుకొంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాన్నాళ్ల తర్వాత తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఇక, తేజ దర్శకత్వంలో కాజల్ నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా సీత. మోడ్రన్ సీతగా కాజల్ ని చూపించబోతున్నాడు తేజ.


“>