రివ్యూ : సెవెన్

చిత్రం : సెవెన్ (2019)
నటీనటులు : రహ్మాన్, హవిష్, రెజీనా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి తదితరులు
సంగీతం : చైతన్ భరద్వాజ్
దర్శకత్వం : నిజార్ షఫీ
నిర్మాత : రమేష్ వర్మ
రిలీజ్ డేట్ : 06 జూన్, 2019.
రేటింగ్ : 2.75/5
హవిష్, రహ్మాన్, రెజినా, నందితా శ్వేతా, అదితి ఆర్యా, ఆనిశా, పూజితా పొన్నాడ, త్రిధా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెవెన్’. నిజార్ షఫీ దర్శకుడు. రమేష్ వర్మ నిర్మాత. ఈ రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. సినిమాపై అంచనాలని పెంచాయి. మరీ.. ఆ అంచనాలని ‘సెవెన్’ అందుకొందా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో కార్తీక్ (హవీష్) ఉద్యోగం చేస్తుంటాడు. యుఎస్ కి వెళ్లాలన్నది అతడి లక్ష్యం. అందుకోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. మరోవైపు, రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా.. ఈ ముగ్గురు తమ భర్త కనిపించడం లేదని పోలీసులకి ఫిర్యాదు చేస్తాడు. దర్యాప్తులో వీరి ముగ్గురు భర్త ఒకరే కార్తీక్ అని తేలుతుంది. దీంతో అతడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతలో అచ్చం కార్తీక్ లాంటి మరో వ్యక్తి కృష్ణమూర్తి (హవీష్) ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకీ కృష్ణమూర్తి ఎవరు ? ఆ ముగ్గురి ప్రేమకథలు ఎలా సాగాయి ? అన్నది రొమాంటిక్ సస్పెన్స్ తో కూడిన డ్రామాయే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* స్టోరీ లైన్
* హవీష్, రెజీనా, నందితా శ్వేతాల నటన
మైనస్ పాయింట్స్ :
* కథనం
* స్లో నేరేషన్
* క్లైమాక్స్
ఎలా ఉందంటే ?
దర్శకుడు నిజార్ షఫీ ఎంచుకొన్న లైన్ బాగుంది. ఐతే, ఈ డిఫరెంట్ లైన్ కి గ్రిప్పింగ్ స్కీన్ ప్లేని రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడు. భర్త మిస్సయినట్టు అమ్మాయిలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసే సీన్లు బాగున్నాయి. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకొంటాయి. ప్రీ క్లైమాక్స్ ఏపీసోడ్ సినిమాకు ప్రధానబలం. సెకాంఢాఫ్ లో సినిమా స్లోగా సాగింది. మెయిల్ లవ్ స్టోరీని ఇంకాస్త బాగా చూపిస్తే బాగుండేది. మొత్తంగా.. డిఫరెంట్ గా ట్రై చేశారు. అది అన్నీ వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే ?
రొమాన్స్, సస్పెన్స్ తో ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసే స్కోప్ ఉన్న లైన్ ఇది. కొన్ని సన్నివేశాలు అలాగే ఉన్నాయి. ఐతే, సినిమా ముందుకు సాగుతుంటే.. గ్రిప్పింగ్ తగ్గినట్టు అనిపించింది. ఐతే, ప్రధాన తారగణం నటన సినిమాని కాస్త నిలబెట్టింది. హవీష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో బాగా నటించారు. హీరోయిన్స్ రెజీనా, నందితా శ్వేత అద్భుతంగా నటించారు. ప్రీ క్లైమాక్స్ లో రెజీనా నటన సూపర్భ్. ఇతర నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
దర్శకుడుగా నిజార్ షఫీ సగం మాత్రమే సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫర్ గా మాత్రం పూర్తి న్యాయం చేశారు. ప్రతీ ఫ్రేములో ఆయన అనుభవం కనిపించింది. చైతన్య భరద్వాజ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకొనేలా లేవు. నేపథ్యం సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : ‘సెవెన్’ కొంచెం కొత్తగా ఉంది.
రేటింగ్ : 2.75/5
