అందుకే రెండు చోట్లా ఓడిపోయా : పవన్

ఓటమి తర్వాత చేసేది ప్రక్షాళనే. ఇప్పుడు జనసేన అదే చేస్తోంది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశాలకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం విజయవాడలో కృష్ణా, పశ్చిమ గోదావరి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి కారణాలని విశ్లేషించారు. అదే సమయంలో తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెందడంపై పవన్ వివరణ ఇచ్చారు. గాజువాక, భీమవరం రెండు చోట్లా తాను పోటీ చేసినప్పటికీ సమయాభావంవల్ల ఏ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయా. అదే తన ఓటిమికి సింగిల్ కారణమన్నారు పవన్.
పవన్ చెప్పింది నిజమే. భీమవరం, గాజువాక స్థానాల్లో గాజువాకలో పవన్ కచ్చితంగా గెలుస్తాడని భావించారు. ఎందుకంటే ? అక్కడే పవన్ కాస్తో కూస్తో ప్రచారం చేశారు. భీమవరంలో అసలు పవన్ ఎన్నికల ప్రచారమే చేయలేదు. అయినా అక్కడ గట్టి పోటీ ఇచ్చాడు. కొన్ని రౌండ్లలో ఆధిక్యం చూపారు కూడా. తనకున్న క్రేజీ దృష్ట్యా రెండు చోట్లా ఈజీ గెలుస్తానని పవన్ భావించారు. అందుకే.. పార్టీ తాను పోటీచేసిన స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేయలేదు. ఐతే, వైకాపా హవా ముందు పవన్ క్రేజీ, ప్రచార వ్యూహాం ఏమాత్రం పని చేయలేదని ఫలితాల తర్వాత అర్థమైంది. ఇప్పుడు పవన్ లక్ష్యం సింగిల్ ని డబుల్ డిజిట్ చేయడమే.. !
