జూ. ప్రభాస్ కథతో ప్రభాస్ సినిమా


కన్నడ సూపర్ స్టార్ యశ్ ని అభిమానులు ముద్దుగా జూనియర్ ప్రభాస్ అని పిలుచుకుంటారు. ఐతే, జూ. ప్రభాస్ కథతో ప్రభాస్ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కొత్త దర్శకుడు ఒకరు యశ్ ని కలిసి కథ చెప్పాడట. అది ఆయన బాగా నచ్చేసింది. కథని యష్ ఓకే చేశారు. కానీ, అది తన కోసం కాదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం. తనకంటే ఈ కథ ప్రభాస్ కి బాగా సూటవుతుందని సజెస్ట్ చేశాడట. త్వరలోనే కొత్త దర్శకుడు ప్రభాస్ ని కలిసి కథ వినిపించనున్నాడు. ప్రభాస్ కు కూడా కథ నచ్చితే.. కొత్త దర్శకుడి పంట పండినట్టే.

గత యేడాది ‘కె.జి.ఎఫ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు యశ్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చారు. విడుదలైన అన్నీ బాషల్లో కె జి ఎఫ్ హవా చూపించింది. బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకొంది. ప్రస్తుతం కె జి ఎఫ్ సీక్వెల్ లో నటిస్తున్నారు యష్. ఇందులో పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. కె జి ఎఫ్ ని మించేలా కె జి ఎప్2ని తీసుకొస్తున్నారు. ఇటీవలే కె జి ఎఫ్ 2 సెట్స్ మీదకు వెళ్లింది. యశ్ యాక్షన్ లోకి దిగాడు.