రెండో టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 

పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించినా.. ఆ తర్వాత స్పిన్నర్లకి అనుకూలంగా మారవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొన్నారు.

తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 203 పరుగుల తేడాతో సఫారీలని ఓడించారు. రెండో టెస్టులోనూ అదే జోరును కొనసాగించడమే లక్ష్యంగా బరిలో దిగింది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది. ఎంసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికా-భారత్ 30 టెస్టులు ఆడాయి. 2017లో ఒక్కసారి మాత్రమే భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. 

రెండో టెస్ట్ జట్ల వివరాలు 

భారత్ : మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, వృద్ధమాన్  సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి

దక్షిణాఫ్రికా : ఎల్గర్, మార్ క్రమ్, డిబ్రుయిన్, టెంబా బవుమా, డుప్లెసిస్, డికాక్, ముత్తుసామి, ఫిలాండర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, ఎన్రిచ్