ఈ వారమే సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన 


ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారభించనున్నారు.  ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లుపై దృష్టి పెట్టింది. ఐతే, సీఎం నిజామాబాద్ పర్యటన ఈ వారమే ఉండనుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరావు తెలిపారు. స్పీకర్ ప్రకటనతో ఏర్పాట్లని మరింత వేగంవంతం చేస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె, పరిణామాలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకి ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. మరోవైపు సమ్మె చేస్తున్న ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని తీసుకొనేందుకు నోటిఫికేషన్ కి రెడీ చేయాలని అధికారులని ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె పై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేయలేకపోతున్నారు. ఇవాళో, రేపో నిజామాబాద్ పర్యటనపై షెడ్యూల్ రానుంది.